సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం

సీబీఐ విచారణ కోరే దమ్ముందా

సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్‌

నెల్లూరు:  టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  బతుకు అంతా అవినీతిమయమ‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు.  ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని నిరూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా అని కాకాణి ప్రశ్నించారు. సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శనివారం కాకాణి మీడియాతో మాట్లాడారు.

‘తాను చెప్పిన పనులు అధికారులు చెయ్యడం లేదనే  ఫ్రస్టేషన్‌లో  సోమిరెడ్డి ఉన్నారు.తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని సోమిరెడ్డి బాధపడుతున్నారు. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయం.కేసులు,అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచిన తర్వాత మంచంలో పడుకుని ఉన్నాలాక్కొస్తాం. 

నా పై చేస్తున్న అవినీతి ఆరోపణలలో ఒక్క దానినైనా రుజువు చెయ్యగలవా?నీకు దమ్ము దైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్టు నిరూపించు. సూరాయి పాలేం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాల మీద గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తున్నాం. 

నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకి అదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గాను. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు వద్దకు సోమిరెడ్డి వెళ్తే  అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.సోమిరెడ్డి అవినీతి మీద విచారణ వేయాలి.ఆయన చేసిన అవినీతి బయటడుతుంది’అని కాకాణి అన్నారు. 

Back to Top