దృష్టిలోపంతోనే పేదలు చంద్రబాబుకు కనిపించలేదని

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

స్కీమ్‌ల పేరిట చంద్రబాబు స్కామ్‌

చంద్రబాబుకు ఆరోగ్యరీత్యా బెయిల్‌ వచ్చింది

చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం 27వ స్థానంలో ఉండేది

సీఎం వైయస్‌ జగన్‌ హయాంలో వ్యవసాయ రంగం నంబర్‌1 స్థానంలో ఉంది

చంద్రబాబుకు, వైయస్‌ జగన్‌ ఎలాంటి పోలిక లేదు

కాకినాడ:  చంద్రబాబుకు దృష్టిలోపం ఎప్పటి నుంచో ఉంది..ఆ దృష్టిలోపంతోనే రాష్ట్రంలో పేదలు ఆయనకు కనిపించలేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. స్కీమ్‌ల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని మండిపడ్డారు. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. చద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. పక్కా ఆధారాలతోనే చంద్రబాబు జైలుకు వెళ్లారు. 
చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అని మా నాయకులు వైయస్‌ జగన్‌ చెప్పారు.  బుధవారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని ప్రశ్నించిన పెద్ద మనుషులు ఇప్పుడు మేమొస్తే గ్యారంటీ అంటున్నారు. ష్యూరిటీ అంటున్నారు. అసలు చంద్రబాబుకే గ్యారంటీ లేదు. అలాంటి మీరు వచ్చి ఎవరికి గ్యారంటీ ఇస్తారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను ఏ మేరకు అమలు చేశారో దమ్ముంటే జనాలకు చెప్పాలని సవాలు విసిరారు. ఇప్పుడు మళ్లీ తగుదునమ్మా అంటూ తయారయ్యారు. ఎన్నిసార్లు మీరు అబద్ధాలు చెబితే అన్ని సార్లు జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. 
నిన్న టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారట. గవర్నర్‌కు కూడా టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. మాపై వేలాది కేసులు నమోదు చేశారని గవర్నర్‌కు చెబుతున్నారు. ఒకడేమో ఈఎస్‌ఐ స్కామ్‌ చేసి మందుల పేరుతో టెండర్లు పిలవకుండా లెటర్‌హెడ్‌తో పనులు కేటాయించి వందల కోట్లు లాగించాడు. అలాంటి నాయకుడిని అరెస్టు చేయకూడదట. మద్యానికి బానిసై కుటుంబాలు నాశనమవుతున్నాయని మేం బాధపడుతున్నాం. మద్యం అలవాటు మాన్పించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుకుంటుంటే..తాగడానికి మద్యం దొరకడం లేదని టీడీపీ నేతలు బాధపడుతున్నారు. అదీ వాళ్లు చేసే నిర్వాకం. మాట్లాడితే ఇసుక ఇసుక అంటున్నారు. దొంగ ఇసుక రవాణాలో శ్రీకాళహస్తి వద్ద ఒక లారీలో ఇసుకను తీసుకెళ్లే క్రమంలో రాత్రిపూట ఇసుక లారీని పుట్‌పాత్‌పైకి ఎక్కించి 17 మందిని పొట్టనపెట్టుకున్నారు. ముమ్మడివరం గ్రామంలో ఇసుక దోపిడీని అడ్డుకున్న ఎస్సీ, ఎస్టీ,బీసీ యువత మీద ఎఫ్‌ఐఆర్‌ వేసి కేసులు కట్టి జైలుకు పంపించారు. చేసిందంతా వారు చేసి ఎదుటివారిపై బురద జల్లుతుంటారు. ఈ బురదను ఎదుటి వ్యక్తులు రోజు కడుక్కుంటుండాలి. 
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తలసరి ఆదాయం 17వ స్థానంలో ఉండేవాళ్లం. ఇవాళ 9వ స్థానంలోకి వచ్చింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 34,108 మాత్రమే. మన ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన ఉద్యోగాలు 4.93 లక్షలు. కోవిడ్‌లో చనిపోతే కనీసం ఆరు నెలలు తిరుగకుండానే కారుణ్య నియామకాలు చేపట్టాం. ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. మా ప్రభుత్వంలో ప్రతీ దాంట్లో పారదర్శకత ఉంది. టీడీపీ నేతలు దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
చంద్రబాబు హయాంలో ఏపీలో వ్యవసాయ రంగం 27వ స్థానంలో ఉంది. కింది నుంచి మొదటిది. పై నుంచి చివరి స్థానంలో ఏపీ ఉండేది. మా ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఎం వైయస్‌ జగన్‌ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల బీమా ఇలా వేల కోట్లు ఇచ్చారు. 
పరిశ్రమలు రావడం లేదని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో పరిశ్రమల వృద్ధి రేటు చూస్తే..దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉండేది. కానీ ఎల్లోమీడియాలో మాత్రం 2వ స్థానం అన్నట్లుగా అప్పట్లో బిల్డప్‌ ఇచ్చేవారు. ఇవాళ జగనన్న ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపన, వృద్ధిరేటులో 3వ స్థానంలో ఏపీ ఉంది. ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామీగా ముందుకు వెళ్తుంటే ..ఇదేదో రౌడీ రాజ్యం అంటున్నారు. ఇంకేవేవో అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు తప్పు చేస్తే కూడా జైల్‌లో వేయకూడదట. ఆయన జైల్‌లో ఉంటే పెద్ద డ్రామా..బాబుకు కళ్లు కనిపించడం లేదని, ఆపరేషన్‌ చేయించుకునేందుకు బెయిల్‌ ఇచ్చారు. ఆరోగ్యం బాగోలేదంటే సానుభూతితో బెయిల్‌ ఇచ్చారు. కానీ వాళ్లు బయటకు వచ్చి బెయిల్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు దృష్టిలోపం ఉందని ఇప్పుడు తెలిసి ఆపరేషన్‌ చేయించుకున్నారు. చంద్రబాబుకు దృష్టిలోపం ఇప్పుడు వచ్చింది కాదు..ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేదల పక్షాన చూడలేకపోయారు. రాష్ట్ర అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ఈ రాష్ట్ర సంక్షేమం చంద్రబాబుకు కనిపించడం లేదు. దృష్టిలోపం ఉండబట్టే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోను ఆయనే చదవలేకపోయారు. ఆయన దృష్టిలోపాన్ని కనిపెట్టే 2019లో టీడీపీకి అలాంటి తీర్పు ఇచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే..సొంత కొడుకే మా నాన్నకు ఆ జబ్బు ఉంది..ఈ రోగం ఉందని రోడ్డెక్కి చంద్రబాబును అపఖ్యాతిపాలు చేస్తున్నారు.
సమర్ధవంతమైన నాయకుడికి సమర్ధవంతమైన కొడుకు ఉంటారు. అలాంటి వ్యక్తే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అదే రివర్స్‌లో చూస్తే అవతల వైపు ఎవరు కనిపిస్తారో గమనించాలి. చంద్రబాబుకు, వైయస్‌ జగన్‌కు పోలికే లేదు. నక్కజిత్తుల రాజకీయం చేసే చంద్రబాబుకు నేరుగా నా దారి ర హదారి..చెబితే చేస్తా అంటూ మాట నిలబెట్టుకుంటున్న వైయస్‌ జగన్‌కు ఉన్న తేడాను జనం అర్థం చేసుకున్నారు. ఈ విషయాలను ప్రజలకు వివరించేందుకు ఏపీకి వైయస్‌ జగనే ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి కన్నబాబు పిలుపునిచ్చారు. 
టీడీపీ, జనసేన పొత్తులు 2011 నుంచి చూస్తున్నాం. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిది బలమైన నాయకత్వం కాబట్టే బలహీనులంతా కలిసి పొత్తులో వస్తున్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్న చరిత్ర చంద్రబాబుది. వైయస్‌ జగన్‌ ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రజల కష్టాలు కళ్లారా చూసి వారిని ఆదుకుంటున్న చరిత్ర వైయస్‌ జగన్‌ది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నాడు. చంద్రబాబు జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన చరిత్ర ఉందా?. జర్నలిస్టుల్లో వైయస్‌ జగన్‌ కళంకారీలను చూశాడు కాబట్టే ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన జర్నలిస్టుల పక్షాన నిలిచిన వైయస్‌ జగన్‌..చంద్రబాబు మాత్రం పత్రికా యాజమాన్యాల తరఫున నిలబడ్డారు. ఇదే పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటే..పెద్ద పత్రికల యాజమాన్యాలకు వాళ్ల ప్రింటింగ్‌ ప్రెస్‌లు పెట్టుకోవడానికి చంద్రబాబు స్థలాలు ఇస్తే..చిన్న పత్రికల్లో సైతం పని చేస్తున్న జర్నలిస్టులకు సీఎం వైయస్‌ జగన్‌ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. చంద్రబాబు పెత్తందార్లకు సపోర్టు చేస్తే..సీఎం వైయస్‌ జగన్‌ పేదల పక్షాన ఉంటున్నారు. అందుకే చంద్రబాబు కడుపు మంట, ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.
 

Back to Top