పెనుకొండలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల సమరానికి సిద్ధం

 మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వాల్మీకి శ్రీనివాసులుతో పాటు 23 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు ఫారం-బి అందజేత  

శ్రీ సత్యసాయి జిల్లా:  పెనుకొండ నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెనుకొండలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వాల్మీకి శ్రీనివాసులు (జంపు శ్రీనివాసులు)తో పాటు 23 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఫారం-బి పత్రాలను అందజేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఎన్నికల కార్యాచరణకు సిద్ధమయ్యారు. 

Back to Top