అమరావతి: అయిదోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. అదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇటు శాసన మండలిలోనూ స్కిల్ డెవలప్‌మెంట్, విద్య రంగంలో, వైద్య రంగంలో సంస్కరణలపై సబ్యులు చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు నేడే చివరిరోజు. ఈ రోజుతో సమావేశాలు ముగియనున్నాయి.