ఫ్యాన్ సునామి

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో దూసుకుపోతున్న వైయ‌స్ఆర్‌సీపీ

143 అసెంబ్లీ స్థానాల్లో ముంద‌జ

వైయ‌స్ జ‌గ‌న్‌కు జైకొట్టిన ఏపీ ప్ర‌జ‌లు 

అమ‌రావ‌తి:  సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ  విజయం ఖాయ‌మైంది. ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో తేటతెల్లం కావడంతో పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉండ‌గా .. ఓట్ల లెక్కింపులో ఫ‌లితాలు ఏక‌ప‌క్షంగా సాగుతున్నాయి. ఇవాళ ఉద‌యం నుంచి ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుండ‌గా..మొద‌టి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. కొద్దిసేప‌టి క్రితం 143 అసెంబ్లీ స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ దూసుకుపోతోంది.  రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు  తెరపడింది. ఐదేళ్లుగా అధికార తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ తెగించి పోరాడిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు కౌంటింగ్‌లో సానుకూల ఫలితాలు రావ‌డంతో ఉత్సాహంగా ఉన్నారు.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ కల నెరవేరబోతోందని ప్ర‌జ‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు.  

Back to Top