అన్నమయ్య జిల్లా: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. రాయచోటి నియోజకవర్గం సంబేపల్లె మండలం సంబేపల్లె, రౌతుకుంట గ్రామాల్లో రచ్చబండ- కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను చేరువ చేయాలని, వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను చంద్రబాబు కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు పి పి పి విధానం తీసుకు వచ్చారని అన్నారు. వైద్య కళాశాలలపై ప్రజాభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్ కు అందచేసి, ప్రైవేటీకరణను అడ్డుకోవాలని వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను తీసుకు రాలేకపోయారని, వైయస్ జగన్ ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ తో గడచిన, మూడేళ్ళలో 17 మెడికల్ కళాశాలలను తీసుకు వచ్చారన్నారు.ఇందులో 5 వాటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని వివిధ నిర్మాణ దశల్లో ఉంచారన్నారు. ఒక కొత్త పెన్షన్ లేదు..ఒక్క పక్కా గృహం మంజూరు కాలేదు... కూటమి ప్రభుత్వ పాలనలో స్పౌజ్ పెన్షన్లు మినహా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వికలాంగుల పెన్షన్లలో కూడా సదరం పేరుతో కోతలు వేస్తుండడం అన్యాయ మన్నారు. ఒక్క నూతన పక్కా గృహం కూడా మంజూరు కాలేదన్నారు.జగన్ హయాంలో నియోజక వర్గ వ్యాప్తంగా 20 వేల పక్కా గృహాలు మంజూరు చేయించి,95 జగనన్న కాలనీలును నిర్మింపచేసామని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్ హయాంలో ఆలయ నిర్మాణాలకు పెద్దపీట... గత వైయస్ జగన్ ప్రభుత్వంలో రాయచోటి నియోజక వర్గ వ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 76 ఆలయాలకు నిధులను మంజూరు చేయించామన్నారు. సి జి ఎఫ్ నిధులను కోట్లాది రూపాయలతో ఆలయాల అభివృద్ధికి కృషి చేసామన్నారు.సంబేపల్లె మండలంలో శ్రీదేవరరాయి నల్లగంగమ్మ తల్లి, పశుపతి నాధ ఆలయం,దేవపట్లమ్మ తల్లి, శెట్టిపల్లె లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,పెద్దబిడికి లో ఆలయాల అభివృద్ధి, చిన్నమండెం మండలంలో మండెం లక్ష్మీ నరసింహ స్వామి, మల్లూరమ్మ, కొత్తపల్లె లో రామాలయం, రాయచోటి పట్టణంలో వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధి, మాడవీధుల నిర్మాణాలుకు కృషి చేశామన్నారు. కార్యకర్తలు, నాయకులకు ఎల్లవేళలా తోడుగా ఉంటా.. కమిటీల నిర్మాణంతో పాటు పార్టీ అభివృద్ధిపై గడికోట శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. రాబోయే రోజులలో కార్యకర్తల అభిప్రాయం మేరకు వైయస్ జగన్ పాలన ఉంటుందన్నారు. అధిక వర్షాల వల్ల నియోజక వర్గంలో పంటలు దెబ్బతింటే నియోజక వర్గం లో ప్రతి గ్రామానికి రూ కోటి మేర ఇన్ ఫుట్ సబ్సిడీ అందేలా కృషి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతులకు రైతు భరోసా ను ఇవ్వడం లేదన్నారు.మొదటి ఏడాది రైతు భరోసాను ఎగురకొట్టారన్నారు. ఊపిరి ఉన్నంతవరకూ ప్రజా సేవలో వుంటానన్నారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.కలసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందా మన్నారు.యువజన, విద్యార్థి, మహిళా, బిసి, ఎస్ సి, ఎస్ టి, రైతు విభాగాల కమిటీలను బలోపేతం చేసిందామని, కమిటీ సభ్యులకు త్వరలో గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఇన్స్యూరెన్స్ లోకి తీసుకెళ్లు చున్నారన్నారు.రూ2700 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మె చేస్తుండం వల్ల తీవ్రంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఒక సంతకం, పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందన్న నమ్మకంతో కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలు భాగస్వాములవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ జెడ్ పి టీసీ సభ్యుడు గొర్ల ఉపేంద్రా రెడ్డి, మండల కన్వీనర్ ఉదయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపిపి బరుగు రెడ్డెన్న, మండల జెసిఎస్ కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి, వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.