నా గురువు రుణం తీర్చుకోవడానికి వచ్చా

వైయస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తలా పనిచేస్తా

వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌

హైదరాబాద్‌: తన గురువు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నిజాముద్దీన్‌ తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎంపీ నిజాముద్దీన్‌ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి అనుభవం లేకున్నా.. టికెట్‌ ఇచ్చి గెలిపించిన వైయస్‌ రాజశేఖరరెడ్డి రుణం ఎప్పటికీ తీర్చుకోలేన్నారు. గురువు రుణం కొంతైనా తీర్చుకోవాలంటే వైయస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కృషి చేయాలని వచ్చానన్నారు. వైయస్‌ఆర్‌ చేసిన సేవలు, పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఇలాంటి పాలన అందిస్తానని వైయస్‌ జగన్‌ వస్తున్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేయడానికి కార్యకర్తగా పనిచేస్తానన్నారు. 

 

Back to Top