ఏపీ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

వేల కిలోమీటర్ల పాదయాత్ర ఒక యజ్ఞం

వైయస్‌ జగన్‌పై నమ్మకంతోనే పార్టీలోకి చేరా..

పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా.బాబ్జీ

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన పాదయాత్ర ఒక యజ్ఞం అని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డా.బాబ్జీ అన్నారు.ప్రజల కష్ట నష్టలను ఆయన దగ్గర నుంచి చూశారని, వారి అవసరాలు తెలుసుకున్నారన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి మాత్రమే ఉందన్నారు.ప్రతి గ్రామాల్లోని స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారం చేపట్టిన తర్వాత వైయస్‌ జగన్‌ తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు.వైయస్‌ జగన్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

 

Back to Top