కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

జనం జనం కలిస్తే జగన్‌

డీఎల్‌ రవీంద్రారెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. మైదుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  సాధారణంగా మనం గ్రామాల్లో మాట్లాడుకుంటాం. గ్రామాల్లో ఇద్దరు మనుషులు కలిస్తే నీవు అంటాం. మనం మనం కలిస్తే మనందరం కలిస్తే జనం అంటాం. జనం జనం కలిస్తే వైయస్‌ జగన్‌ అంటారు. నా ప్రియ మిత్రుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థి రఘురామిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓట్లు వేయాలని డీఎల్‌ రవీంద్రారెడ్డి కోరారు.

నాలుగు సంవత్సరాల 11 నెలల కాలంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు జన్మభూమి కమిటీల ఏర్పాటు చేశారు. ప్రజలకు పింఛన్లు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ నేతలే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారని, మొన్నటి సభలో చంద్రబాబు ముందే ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మైక్‌ గుంజుకున్నారు. మీ అందరూ ఈ ప్రేమను బ్యాలెట్‌ పేపర్‌పై చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26వ తేదీన టైమ్స్‌ ఆఫ్‌ ఎకానమీ అనే ఇంగ్లీష్‌ పేపర్‌లో ఒక కథనం వచ్చిందని, చంద్రబాబు విధానాలు, ఆయన ఏవిధంగా ఓడిపోతున్నారో రాస్తూ..చివర్లో 2004లో చంద్రబాబు వైయస్‌ రాజశేఖరరెడ్డి చేతిలో ఓడిపోయారని, 2019లో అదే చంద్రబాబు వైయస్‌ జగన్‌ చేతిలో ఓడిపోతున్నారని, హ్యాండ్‌సఫ వైయస్‌ జగన్‌  అంటూ ఆ పత్రిక రాసిందని చెప్పారు. 
 

Back to Top