వర్లరామయ్యకు  ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటీసులు

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఫిర్యాదుతో ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నోటీసులు జారీ

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిని అవ‌హేళ‌న‌గా మాట్లాడి, మార్ఫింగ్‌ల‌తో దుష్ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని దీనికి 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టిడిపికి నోటీసులు జారీ చేశారు.

 
1.తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీచేసిన ఎన్నికల కమీషన్.

 ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపైన విజయవాడలో జరిగిన దాడిని డ్రామా అని, నటన అంటూ అవహేళనగా మార్ఫింగ్ లతో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసింది. తన అధికారిక సోషల్ మీడియాలోను,ట్విట్టర్లోను,టిడిపి అఫీసియల్ వెబ్ సైట్ లోను అబధ్దాలు,అసత్యాలు,దురుధ్దేశపూరితంగా విషప్రచారానికి పాల్పడుతున్నవిషయాన్ని ఈనెల 14 వతేదీన వైయస్సార్ సిపి ఎంఎల్ఏ మల్లాది విష్ణు  ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని దీనికి 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టిడిపికి నోటీసులు జారీ చేశారు.

వర్లరామయ్యకు నోటీసులు ఇచ్చి,ఎంసిసి ని అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఈసి ఆదేశాలు

2.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి వర్ల రామయ్య పై విచారణ చేసి నోటీసులు ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీచేసిన ఎన్నికల కమీషన్. గుంటూరులోని టిడిపి రాష్ర్ట కార్యాలయంలో ఈనెల 8 వతేదీన వర్లరామయ్య విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది ఎన్నికల నియమావళికి విరుధ్దం అని దీనిపై వైయస్సార్ సిపి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డికి ఆదేశాలు జారి చేసింది.

Back to Top