తాడేపల్లి: ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లంటే రాజకీయాలు అవపోసపట్టిన నేతలు, పెద్ద పెద్ద కాన్వాయ్‌లలో వచ్చి ఊదరగొట్టే రాజకీయ ఉద్దండులు.. ఈ తరహా ప్రచారం కనిపిస్తుంది. కానీ స్టార్ క్యాంపెయినర్లు అంటే తెలిసిన ముఖాలే ఉండాలా ఏంటి?. దేశ రాజకీయాల్లోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందివైయస్ఆర్‌సీపీ. తొలిసారి సామాన్యులకు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించింది. వైయస్ఆర్‌సీపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 87 శాతం పేదలకు పథకాలు అందాయని, ఇప్పుడు ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్లేందుకు వైయస్ జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాల్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం చేపడుతున్నాం. పార్టీ బూత్ లెవల్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2019-24 మధ్య అమలు చేసిన సంక్షేమం.. ఈ దఫా అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని సీఎం వైయస్ జగన్ చెప్పారో వాటిని వివరిస్తారు. ఇవాళ్టి నుంచే అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఏం చేయబోతుందనేది తెలియజేసేందుకు క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ చేరవేస్తాం. చంద్రబాబులాగా మేనిఫెస్టోను పక్కన పడే విధంగా కాకుండా.. రికార్డెడ్‌గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని సజ్జల ఈ సందర్భంగా అన్నారు. ఇక.. వైయస్ఆర్‌సీపీ తరఫున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశాం. వివిధ సామాజిక వర్గాల నుంచి వీళ్లను ఎంపిక చేసి ఈసీకి అందజేశాం. సీఎం వైయస్ జగన్ మీద తమ అభిమానం ప్రదర్శిస్తూనే.. మరోసారి వైయస్ఆర్‌సీపీకి ఎందుకు ఓటేయాలో వీళ్లు రాష్ట్ర ఓటర్లకు వివరిస్తారని సజ్జల తెలిపారు. వైయస్ఆర్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే చల్లా ఈశ్వరి(మైలవరం, ఎన్టీఆర్ జిల్లా) ఎ. అనంతలక్ష్మి(రాజమండ్రి సిటీ, తూర్పు గోదావరి జిల్లా) పండలనేని శివప్రసాద్(అవనిగడ్డ, కృష్ణా) సయ్యద్ అన్వర్(నెల్లూరు జిల్లా) కటారి జగదీష్(అనకాపల్లి జిల్లా) తనకు టీడీపీకి, చంద్రబాబుకి ఉన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్లు లేరని, వైయస్ఆర్‌సీపీ పాలనలో లబ్ధి పొందిన సామాన్యులే తన స్టార్‌క్యాంపెయినర్లు అని, ఈ లెక్కన దేశంలోనే తనకు ఉన్నంత స్టార్ క్యాంపెయినింగ్ మరెవరికి ఉండబోదని, ఇది ఒక చరిత్ర అని సీఎం వైయస్ జగన్ తరచూ చెబుతూ వస్తుండడం చూస్తున్నదే. ఇప్పుడు అదే నిజం చేస్తూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సామాన్యులకు చోటు కల్పించి ట్రెండ్ సెట్ చేశారు.