న‌ర‌సాపురం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన వైయ‌స్ఆర్ సీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు

న‌ర‌సాపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి న‌ర‌సాపురం చేరుకున్నారు. హెలిప్యాడ్ వ‌ద్ద ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. హెలిప్యాడ్ నుంచి న‌ర‌సాపురం స్టీమర్ సెంట‌ర్ వ‌ర‌కు దారిపొడ‌వునా ప్ర‌జ‌లు పూల‌వ‌ర్షంతో సీఎంకు స్వాగ‌తం ప‌లికారు. రోడ్డుకు ఇరువైపులా కిక్కిరిసిపోయిన ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స్టీమర్ సెంట‌ర్‌కు చేరుకున్నారు. మ‌రికాసేప‌ట్లో న‌ర‌సాపురం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. 

న‌ర‌సాపురం స‌భ అనంత‌రం మ‌ధ్యాహ్నం నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు. అనంతరం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో ఉన్న పామూరు బస్‌స్టాండ్‌ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.

Back to Top