రూ.137 కోట్లతో 352 గిరిజన పాఠశాలలను ఆధునీకరించాం

అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

అసెంబ్లీ: మనబడి నాడు–నేడు కింద మొదటి విడతలో 352 గిరిజన సంక్షేమ పాఠశాలలను ఆధునీకరించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమాధానమిచ్చారు. జిల్లాల వారీగా గిరిజన సంక్షేమ పాఠశాలల సంఖ్య, వాటికి ఖర్చు చేసిన నిధుల వివరాలు వెల్లడించారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు నుంచి మొత్తం 352 గిరిజన సంక్షేమ పాఠశాలలను మొదటి విడత నాడు–నేడు కింద ఆధునీకరించామన్నారు. ఇందుకు మొత్తంగా రూ.137.13 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top