రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
 

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా భూములు రీ సర్వే చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. భూ రికార్డుల సర్వే టెండర్ల ఖరారు విషయంలో కొన్ని పత్రికల తప్పుడు కథనాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 3.31 కోట్ల ఎకరాల భూమి ఉందని చెప్పారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డెట్‌ చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అధికారులు కష్టపడి పని చేస్తుంటే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. పేదలకు, వివిధ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుల విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతామని పేర్కొన్నారు. 
 

Back to Top