స్వామి వివేకానంద యువతకు మార్గనిర్దేశం 

విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌
 

శ్రీ‌కాకుళం:  స్వామి వివేకానంద యువ‌త‌కు మార్గ‌నిర్దేశ‌మ‌ని డిప్యూటీ సీఎం ధ‌ర్మ‌న కృష్ణ‌దాస్ అన్నారు.  స్వామి వివేకానంద జయంతిని పుర‌స్క‌రించుకొని శ్రీకాకుళం సూర్య మహల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ధ‌ర్మాన ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..  గొప్ప తత్వవేత్తలలో ఒకరైన స్వామి వివేకానంద జీవితం, బోధనలను గౌరవించటానికి భారతదేశం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంద‌న్నారు.  జనవరి 12, 1863న స్వామి వివేకానంద ఉత్తర కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించారు. భారతదేశంలో హిందూమతం యొక్క పునరుజ్జీవనం వెనుక ఒక ప్రధాన శక్తిగా పరిగణించబడ్డారు.  సమాజాన్ని ఉద్దరించడానికి అనుసరించాల్సిన మార్గాలను ఆయన ఎన్నో చెప్పార‌ని గుర్తు చేశారు.  కార్య‌క్ర‌మంలో ఏపీ కళింగ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్  బి పద్మావతి, ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top