దేశంలోనే కొత్త చరిత్రకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాంది  

 డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా

విజ‌య‌వాడ‌:  అట్టడుగు వర్గాలను గుర్తించి వారికి అభివృద్ధి ఫలాలను అందిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే సరికొత్త చరిత్రకు నాంది పలికారని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా అన్నారు. రాష్ట్రంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి భారతరత్న మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ అవార్డులతోపాటు 9 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు, 27 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్‌లకు, 28 మంది ఉత్తమ విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం విజయవాడలో బుధవారం జరిగింది.

ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్‌ హెచ్‌.నదీం అహ్మద్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌ రహీఫైదయ్‌కు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జాతీయ పురస్కారాన్ని, డాక్టర్‌ ఎస్‌ఏ సత్తార్‌ సాహెబ్‌కు డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ పురస్కారాన్ని ఉప ముఖ్యమంత్రి అందజేశారు. జీవిత సాఫల్య పురస్కారాలలో హజరత్‌షా కమల్‌ అవార్డు(కవిత్వం)ను రఫత్‌ అసియా షాహీన్, అల్లం యాసీర్‌ కర్నూలీ అవార్డు(కవిత్వం) షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌ ఫైజీ, సులేమాన్‌ జావీద్‌ అవార్డు(పరిశోధన) కె.బషీర్‌ అహ్మద్, దుర్వేష్‌ ఖాద్రీ జాకీ అవార్డు(విద్యా బోధన విభాగం) ముస్తఫా హస్సన్, నజీర్‌ అహ్మద్‌ అవార్డు(జర్నలిస్ట్‌ విభాగం) సయద్‌ ఖుద్ర ఖాద్రీ, మిజఫైక్‌ తుర్కమని అవార్డు(ఉర్దూ అభివృద్ధి) హఫీజ్‌ షేక్‌ అహ్మద్, యుసఫ్‌ సఫీ అవార్డు(ఉర్దూ అభివృద్ధి) షేక్‌ మెహబూబ్‌ బాషా, ఉర్దూ ఎక్స్‌లెన్సీ అవార్డు షేక్‌ మహ్మద్‌ హనీఫ్‌ అయాజ్, స్పెషల్‌ అవార్డు(ఉర్దూ భాషాభివృద్ధి) మహ్మద్‌ అబ్దుల్‌ ఫరూఖీలకు అందజేసి సత్కరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు హాఫీజ్‌ ఖాన్, మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గా, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పి.గౌతంరెడ్డి, అడపా శేషు, సమీమ్‌ అస్లాం, అసిఫా, బండి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top