హెరిటేజ్‌కు నాంప‌ల్లి కోర్టు షాక్‌.. 

మంత్రి క‌న్న‌బాబు, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు కేసు కొట్టివేత‌

హైద‌రాబాద్‌: హెరిటేజ్‌ సంస్థకు గౌర‌వ న్యాయ‌స్థానం షాక్‌ ఇచ్చింది. గతంలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై హెరిటేజ్‌ సంస్థ పరువునష్టం కింద నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది.హెరిటేజ్‌ కేసులో సంస్థ అధికారులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ మేరకు మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది.

తాజా ఫోటోలు

Back to Top