అన్నా అనే పదానికి బాబుకు అర్థం తెలుసా

చంద్రబాబు, ఆయన కోటరీది మృగం స్వభావం

వైయస్‌ షర్మిలపై దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉంది

బాలకృష్ణ బిల్డింగ్‌ నుంచి దొంగ సర్వేలు, విషప్రచారాలు

టీఎఫ్‌సీ మీడియా డైరెక్టర్లను బాబే విజయవాడలో దాచాడు

ఇలాంటి దుర్మారుడి పాలనలో మహిళలకు రక్షణ ఉంటుందా

వైయస్‌ షర్మిలపై జరిగిన దుష్ప్రచారాన్ని మహిళా లోకం ఖండించాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌: చంద్రబాబు, ఆయన కోటరీది మృగం స్వభావం అని, సొంత అక్కచెల్లెమ్మలకే అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రంలో కోటి మంది మహిళలకు న్యాయం చేస్తాడంటే ఎలా నమ్ముతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిలపై జరిగిన దుష్ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని స్పష్టమైపోయిందన్నారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ బిల్డింగ్‌లో లోకేష్‌ కనుసన్నల్లో టీఎఫ్‌సీ మీడియా ద్వారా విషప్రచారం జరుపుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వైయస్‌ షర్మిలపై గతంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమె వ్యక్తిత్వంపై అవమానకరంగా జరిగిన ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అనేక ఆధారాలు బయటపడుతున్నాయి. ఇంతకు ముందే వైయస్‌ షర్మిల కంప్లయింట్‌ ఇస్తూ తనపై ఆరోపణలు చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న సోషల్‌ మీడియా ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆధారాలతో విశ్వసిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లాలోని మంత్రి అనుచరుడు వైయస్‌ షర్మిలపై వ్యక్తిగత దూషణలకు దిగాడని నిరూపణ అయింది. 

హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ బిల్డింగ్‌లో టీఎఫ్‌సీ అనే సోషల్‌ మీడియా యూట్యూబ్‌ చానల్‌తో చేస్తున్న అరాచకాలు తాజాగా బయటకు వచ్చాయి. టీఎఫ్‌సీ మీడియా దొంగ సర్వేలు చేస్తుందని పట్టుబడింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తుందనే దానిపై విచారణ చేస్తే ఎన్‌బీకే బిల్డింగ్‌లో ఉన్న ఈ సంస్థ దొంగ సర్వేలను మాత్రమే కాదు.. గతంలో వైయస్‌ షర్మిలపై దుష్ప్రచారం చేసింది ఇదే సంస్థ అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో దిగజారిందో ఆలోచించుకోవాలి

వైయస్‌ఆర్‌ కుటుంబం రాజకీయాల నుంచి వెళ్లిపోవాలనే కుటిల ప్రయత్నం చంద్రబాబు గత పదేళ్లుగా చేస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా వైయస్‌ కుటుంబంలోని మహిళలకు బయటకు రాకుండా వారి మానసిక సై్థర్యం దెబ్బతీసే విధంగా బూతులు, అబద్ధాలతో ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి చంద్రబాబు డైరెక్షన్, బాలకృష్ణ ప్రోత్సాహం, లోకేష్‌ కనుసన్నల్లో జరిగింది. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా చంద్రబాబూ..వైయస్‌ షర్మిల గతంలో ఆమెపై జరిగిన దుష్ప్రచారంపై మాట్లాడితే.. మాకు అంటగట్టకండి అని చంద్రబాబు మాట్లాడారు.. మరీ ఈ రోజు ఏం సమాధానం చెబుతారు. ఆంధ్రజ్యోతిలో ఓ సంస్థ సర్వే పేరుతో చంద్రబాబుదే అధికారమని తప్పుడు కథనం ప్రచురితమైంది. ఆ  సర్వే సంస్థ చివాట్లు పెడితే క్షమాపణ కూడా చెప్పే లక్షణం కూడా లేదు. చంద్రబాబుకంటే ఆడపిల్లలు లేరు బాలకృష్ణకు ఇద్దరు ఉన్నారుగా.. ఇదేనా మీరు చేసే పద్ధతి. వీళ్ల నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు క్షేమంగా ఉండగలరా.. వైయస్‌ విజయమ్మ, వైయస్‌ షర్మిలమ్మ ప్రచారానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇంటి ఓనర్‌తో ఓ వ్యక్తి గొడవ పడితే దానికి వైయస్‌ఆర్‌ సీపీకి అంటగట్టడం. భార్యభర్తలు తగాదాలు పడిన వైయస్‌ జగన్‌ చేయించాడని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్నికల సభల్లో మాట్లాడుతున్నాడు.  

పసుపు – కుంకుమ అని, కోట్ల మందికి అన్న అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. అన్న అనే పదానికి చంద్రబాబుకు అర్థం తెలుసా.. అన్న అనే పదానికి అర్థం తెలిసిన వాడివైతే వైయస్‌ షర్మిల మీద ఇంత నీచ స్థాయికి దిగజారుతాడా..ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకొని కొడితే ఆఫీస్‌కు పిలిపించి సెటిల్‌మెంట్లు చేశాడు. మహిళా నాయకురాలంటే గౌరవం లేదు. మహిళా అధికారులంటే గౌరవం లేదు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతలను కాపాడడం కోసం చంద్రబాబు దగ్గరుండి కేసును నీరుగార్చారు. డ్వాక్రా రుణాలు మొత్తం ఎగ్గొట్టి బ్యాంకులకు కట్టాల్సిన జీరో వడ్డీలను ఎగ్గొట్టి రెండ్రోజుల ముందు పసుపు కుంకుమ ఇస్తున్నాను.. అన్నగా హారతులు పట్టండి అని ఊరేగుతున్నాడు. ఎవరైనా చంద్రబాబును, ఆ పార్టీ నాయకులను మనుషులుగా గుర్తిస్తారా.. బాలకృష్ణ బిల్డింగ్‌లో నడుపుతున్న టీఎఫ్‌సీ మీడియా డైరెక్టర్‌లు తేజోభాను, ప్రియదర్శిని, రామకృష్ణ వీరంతా తప్పించుకొని చంద్రబాబు అడ్డాలో ఉన్నారు. పోలీసులకు దొరక్కుండా విజయవాడలో చంద్రబాబు దాచారు. డేటా చోరీ కేసులో నేరస్తుడు అశోక్‌బాబును దాచి ఇప్పటికీ బయటపెట్టకుండా కాపలాకాస్తున్నారు. వైయస్‌ షర్మిలపై చంద్రబాబు చేసిన నీచ ప్రచారాన్ని ప్రతి మహిళా ఖండించాలని మనవి చేస్తున్నాం. 

Back to Top