కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చింది సీఎం వైయ‌స్ జగనే

టీడీపీ, చంద్ర‌బాబుకు దేవినేని అవినాష్‌ కౌంటర్‌..

విజ‌య‌వాడ‌: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే అని వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి దేవినేని అవినాష్ స్ప‌ష్టం చేశారు. కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నార‌ని,  టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతామ‌న్నారు. బుధ‌వారం టీడీపీ, చంద్ర‌బాబుకు దేవినేని అవినాష్‌ కౌంటర్ ఇచ్చారు.

దేవినేని అవినాష్ ఏమ‌న్నారంటే..

 • నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది సీఎం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వమే.
 • స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వేసినవి కావా?
 • కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్‌. 
 • కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు.
 • టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతాం
 • కాపు కళ్యాణమండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నాం
 • టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు
 • స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా  కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది
 • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారు
 • ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారు
 • తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచు కోటను బద్దలకొడతాం
 • నియోజకవర్గంలో బత్తిన రాముతో కలిసి ప్రజల ముందుకు వెళ్తాం
 • జనసేన అధినేత పవన్‌ను సైతం చంద్రబాబు మోసం చేశారు
 • జనసేన పార్టీపై చంద్రబాబు ఆదిపత్యాన్ని సహించలేకే వైయ‌స్ఆర్‌ సీపీకి వచ్చానని బత్తిన రాము తెలిపారు
 • నియోజవర్గ సీనియర్ నాయకులు యలమంచిలి రవి, బత్తిన రాముతో కలిసి కుటుంబ సభ్యుల్లా నియోజకవర్గంలో పర్యటిస్తాం 
 • మంచి మెజారిటీతో సీటు గెలిచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌కు బహుమతిగా ఇస్తాం
Back to Top