ప్రజలను కష్టాల నుంచి బయట పడేసే మేనిఫెస్టో ఇది

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం 
 

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టో పేద ప్ర‌జ‌లను త‌మ క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అన్నారు. మేనిఫెస్టో విడుద‌ల ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సంస్కరణల దిశగా వైయ‌స్ఆర్‌ సీపీ విధానాలు వెళ్తున్నాయ‌న్నారు. మేనిఫెస్టో లో విశాఖను క్యాపిటల్ టౌన్‌గా ప్రకటించడం సంతోషంగా ఉంద‌న్నారు. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుది కాపీ మేనిఫెస్టో టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు వైయ‌స్ జ‌గ‌న్ ఇవ్వ‌లేద‌న్నారు. 

Back to Top