వైయ‌స్ఆర్ సీపీలో చేరిన య‌న‌మ‌ల కృష్ణుడు

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల కృష్ణుడు వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరికృష్ణ, ఎల్‌.భాస్కర్‌ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ చేతుల మీదుగా వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. కార్యక్రమంలో తుని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ పాల్గొన్నారు.

Back to Top