రాష్ట్రానికి, రాయలసీమకు చంద్రబాబు వెన్నుపోటు

తన చేతులతో కరువునేలకు మరణ శాసననం రాశారు

తన లావాదేవీలకోసం, ఆర్థిక ప్రయోజనాలకోసం ఎంతకైనా ఒడిగడతారు

తెలంగాణ సీఎం రేవంత్‌తో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ను ఆపేశారు

ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డే ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే చంద్రబాబు ఉన్నారు

అంబటి రాంబాబు, రాష్ట్ర జలవనరుల శాఖ మాజీ మంత్రి

తాడేపల్లి: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి, రాయలసీమకు మరణశాసనం రాశారు. తన స్వార్థంకోసం, లాలూచీపడి రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారు. తన చేతులతో కరువునేలకు మరణ శాసననం రాశారు. తెలంగాణ సీఎం రేవంత్‌తో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డే ఆ రాష్ట్ర అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన సొంత రాష్ట్రాన్ని ఈ రకంగా తాకట్టు పెట్టడం, రాష్ట్ర ప్రయోజాలను ఈ రకంగా తన స్వార్థంకోసం అమ్ముకోవడం బహుశా దేశ చరిత్రలో ఎక్కడాచూసి ఉండం. చంద్రబాబు వల్లే ఆరోజు రాష్ట్రానికి ఆల్మట్టి రూపంలో ఒక శాపం వచ్చింది, కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ కమీషన్లకోసం ప్రత్యేక హోదాను  తాకట్టుపెట్టి తన చేతిలోకి తీసుకున్నాడు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలా రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూనే ఉన్నాడు. 

శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుజిల్లాలకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టు నీటిమట్టం 875 అడుగులు ఉంటేనేకాని పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నీళ్లు రావు. 840 అడుగులు ఉంటేనే హంద్రీనీవాకు నీళ్లు రావు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి 800 అడుగులనుంచే నీళ్లు ఎత్తిపోసేందుకు తెలంగాణ రాష్ట్రం పలు ప్రాజెక్టులు చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన ప్రాజెక్టులనుంచి పెద్ద ఎత్తున నీటిని తీసుకెళ్లడానికి వేగంగా అడుగులు ముందుకేశారు. మరోవైపు శ్రీశైలం డ్యాం నిండకుండానే విద్యుత్‌ ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం ఖాళీ చేస్తోంది. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి తాగునీటికి, సాగునీటికి తీవ్ర కొరతను దృష్టిలో ఉంచుకుని వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను, రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా నిర్ణయం తీసుకుని రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును మొదలుపెట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేందుకు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను జోరుగా ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్‌రెడ్డిగారి పేరువస్తుందని గత ప్రభుత్వంలో చంద్రబాబుగారు తన టీడీపీ కార్యకర్తల ద్వారా కేసులు వేయించి అడ్డుకునే ప్రయత్నంచేశారు. అయినా సరే రాయలసీమ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ముందుకు కొనసాగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది. చంద్రబాబు నాయుడుగారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పూర్తిగా చేతులు కలిపి, రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్కయాయంచేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండికూడా తన చేతుల ద్వారా స్వయంగా అడ్డుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఇవాళ దీనికి సంబంధించి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించిన విషయాలు దీన్ని నిర్దారిస్తున్నాయి.  రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిన దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. ఇంతటి అన్యాయం చేసిన చంద్రబాబును ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు.

Back to Top