చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్‌

తిరుపతి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రతిపక్షనేత చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే కాణిపాకంలో ప్రమాణానికి రావాలన్నారు. తాను అక్రమంగా సంపాదించినట్టు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని, నిరూపించకుంటే చంద్రబాబు తన ఆస్తి రాసిస్తారా..? అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్‌ విసిరారు. తనపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కాణిపాకంలో ప్రమాణం చేస్తానని, చంద్రబాబుకు ధైర్యం ఉంటూ ప్రమాణానికి రావాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top