ఇకనైనా నీ బుద్ధి మార్చుకో చంద్రబాబు

నిజాలు తెలియకుండా నిందలు వేయడం హేయం

రామచంద్ర – ప్రతాప్‌రెడ్డి మధ్య గొడవకు మంత్రి పెద్దిరెడ్డికి ఏం సంబంధం

డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజం

తిరుపతి: టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డి – మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర మధ్య గొడవను ప్రభుత్వంపై రుద్దాలని చంద్రబాబు అండ్‌ కో, ఎల్లో మీడియా కుట్రలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ధ్వజమెత్తారు. దళితులపై దాడి చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రామచంద్ర – ప్రతాప్‌రెడ్డిల మధ్య జరిగిన గొడవకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏంటీ సంబంధం అని ప్రశ్నించారు. దాడిలో పాల్గొన్న ప్రతాప్‌రెడ్డి టీడీపీ నేత కాదా.. అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారని, నిజనిజాలు తెలియకుండా మాట్లాడడం మంచిది కాదని చంద్రబాబుకు సూచించారు. తెలుగుదేశం నాయకుల మధ్య గొడవలు జరిగితే ప్రభుత్వంపై నిందలు వేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా చంద్రబాబును దళిత సామాజిక వర్గం నమ్మే ప్రసక్తి లేదని, దళితులంతా వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉంటారన్నారు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో చంద్రబాబూ.. అని సూచించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top