చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

పశ్చిమ గోదావరి:  చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని డిప్యూటి సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. బాబు దగ్గర దొరికింది చాలా తక్కువ మొత్తం.. వేల కోట్లు అతను దోచేశాడని, సీమన్స్‌ కంపెనీ ద్వారా రూ.300 కోట్లు దోచేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు మీద వేల కోట్లు, ఇసుక మీద కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ వచ్చాడని ధ్వజమెత్తారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దోపిడీకి ఇది శాంపిల్‌ మాత్రమే అన్నారు. టిడ్కో ఇళ్ల ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు చొప్పున దోచుకున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ, 108 లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. తాను ఇరుక్కుపోతానని ముందే తెలిసి  గత నాలుగు రోజులుగా ఢిల్లీలో కాళ్లబేరానికి చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
 

Back to Top