పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఆర్థికసాయం

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

వైయస్‌ఆర్‌ జిల్లా: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలు ఇబ్బంది పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ ఆర్థిక సాయం అందజేస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద కుటుంబాలకు రూ.వెయ్యి ఆర్థికసాయం చేసి చేయూతనందిస్తున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా  మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్ల ద్వారా ప్రతి పేద కుంటుంబానికి రూ.1000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేదలకు ఆర్థికసాయం అందించేందుకు రూ. 13 వందల కోట్లు విడుదల చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top