పేదల ప్రజల జీవితాలకు ఆసరాగా ఆరోగ్యశ్రీ

పశ్చిమగోదావరిని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సీఎంకు కృతజ్ఞతలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

ఏలూరు: పేదవాడు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని, ఆయన మరణాంతరం గత పదేళ్లుగా అటకెక్కిన ఆరోగ్యశ్రీ పథకానికి వైయస్‌ఆర్‌ తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ పునర్జీవం పోశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలోని కోట్లాది మంది పేద ప్రజల జీవితాలకు ఆసరాగా నిలబడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో సీఎం వైయస్‌ జగన్‌ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మంత్రి ఆళ్ల నాని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ ఆరోగ్యశ్రీ వర్తించేలా ఆ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టేందుకు జిల్లాలో అడుగుపెట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు సభలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. గత ఐదేళ్లు చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ఏ విధంగా భ్రష్టుపట్టించారో.. ఆ బాధ అనుభవించిన వారందరికీ తెలుసన్నారు. ఆరోగ్యశ్రీపై సరైన పర్యవేక్షణ లేకుండా లక్షలాది మంది ప్రజల మరణాలకు చంద్రబాబు కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద పేదల వైద్యం కోసం కేటాయించిన నిధులను కూడా పక్కదోవపట్టించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. 

మహానేత వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మహా సంకల్పంతో ప్రవేశపెడితే.. ఆ కార్యక్రమ లక్ష్యాలను పూర్తిగా అడుగంటించి పేదలతో చెలగాటం ఆడిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి నాని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆరు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య, ఆరోగ్య రంగాలకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తూ.. వైద్యం అనేది పేదవాడికి హక్కుగా ఉండాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకువచ్చారన్నారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు. ఏ కుటుంబం వైద్యం అందక మరణించకూడదని ఎన్నో విస్తృత ప్రయోజనాలు కల్పిస్తూ.. పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు వచ్చారన్నారు.

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చారని, 1059 ఉన్న రోగాలకు మరో వెయ్యి జోడించి 2059 రోగాలను ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చారన్నారు. అంతేకాకుండా కేన్సర్‌ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 130 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తున్నారు. కేవలం వైద్యం చేయించి ఇంటికి పంపిస్తే సరిపోదు.. ఆపరేషన్‌ అయిన తరువాత కూడా రోగి కుటుంబానికి అండగా   విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రతి రోజుకు రూ. 225 ఇస్తున్నారని, డాక్టర్ల సూచనల మేరకు నెలకు రూ. 5 వేలు ఎన్ని నెలలు అయినా అందజేసే మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారన్నారు. 
 

Back to Top