కార్పొరేట్ ఆస్ప‌త్రికి దీటుగా కోవిడ్ కేర్ సెంట‌ర్‌

సీఎం ఆదేశాల‌తో ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు

300 బెడ్స్ సామ‌ర్థ్యం, 30 మంది డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వైద్య సేవ‌లు

కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ విజ‌యసాయిరెడ్డి

విశాఖ‌ప‌ట్నం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల‌కు అనుగుణంగా ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్‌ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌లోని షీలాన‌గ‌ర్‌లో వైయస్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌యసాయిరెడ్డి ఆధ్వ‌ర్యంలో 300 ప‌డ‌కల కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను డిప్యూటీ సీఎం, వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిలు ప్రారంభించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అత్యాధునిక సదుపాయాలతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ని తీర్చిదిద్దారు. దీంట్లో 30 మంది డాక్టర్లు, 90 మంది నర్సులు వైద్య సేవ‌లు అందించ‌నున్నారు. కోవిడ్ పేషంట్లకు వైద్యపరమైన అన్ని సదుపాయాలతో పాటూ మందులు, పౌష్టికాహారం ఉచితంగా అందించ‌నున్న‌ట్లు ఎంపీ విజ‌యసాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌, ప్ర‌గ‌తి భార‌త్ ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు పాల్గొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top