ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉల్లి రైతు కుటుంబానికి ప‌రామ‌ర్శ‌

క‌ర్నూలు: వెల్దుర్ది మండలం కొసనపల్లె గ్రామానికి చెందిన  కురువ రామచంద్రుడు అనే రైతు గిట్టుబాటు ధ‌ర లేక‌ అప్పుల భాద తాళలేక  ఆత్మహత్య చేసుకున్నారు. రైతు కురువ రామచంద్ర నాలుగున్నర ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. నీళ్ల పొలంలో ఉల్లి పంట వేశాడు. ఉల్లి చేతికొచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేక పొలంలోనే ఉంచాడు. ఉల్లికి గిట్టుబాటు ధరలేని పరిస్థితుల్లో అప్పులు తీర్చే దారి లేక ఈనెల 11న పొలంలోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అక్కడ కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, వైయ‌స్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు వంగాల భరత్ కుమార్ రెడ్డి తదితరులు  కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించి, అండగా ఉంటామని  హామీ ఇచ్చారు.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని లేనిపక్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చ‌రించారు.

Back to Top