మాజీ రాష్ట్రపతి, మాజీ శాసనసభ్యుల మృతికి సంతాపం

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలి అంశంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ, శాసనసభ మాజీ సభ్యులు జనార్ధన్, రావి రవింద్రనాథ్, వెంకట చంద్రమోహన్, పైడికొండల మాణిక్యాలరావు, రాజగోపాల్‌రెడ్డి, బమ్మిడి నారాయణస్వామి, అమ్మిరాజు, వీరరాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాద్, పూడి మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాసరావు, శ్రీమతి మోచర్ల జోహార్, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీఏ సత్యప్రభ మృతి పట్ల శాసనసభలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సేవలను శాసనసభ కొనియాడింది. అదే విధంగా మాజీ శాసనసభ్యుల సేవలు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే విధంగా ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. మాజీ రాష్ట్ర‌ప‌తి, మాజీ శాస‌న‌స‌భ్యులు, ప్ర‌ఖ్యాత గాయ‌కుడు ఎస్పీ బాలు మృతికి సంతాపంగా శాస‌న‌స‌భ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top