మానవతా దృక్పథంతో సహాయం చేసే మనస్తత్వం వైయ‌స్ జ‌గ‌న్‌ది 

చంద్ర‌బాబు జూమ్ మీటింగ్‌లు మానుకొని రాష్ర్టానికి రావాలి
 

మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖ : రాష్ర్టంలో భారీ వ‌ర్షాలు న‌మోదైనా, అధికార యంత్రాంగం ముందుగానే అప్ర‌మ‌త్తం కావ‌డం వ‌ల్లే పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం అధికారుల‌తో జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న..ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చర్యలు తీసుకుంటే చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు లాగా కేవ‌లం ఫోటోల‌కు ఫోజులిచ్చే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కాద‌ని న‌ష్టం జ‌రిగిన వెంట‌నే మానవతా దృక్పథంతో సహాయం చేసే మనస్తత్వం జ‌గ‌న్‌ది అని పేర్కొన్నారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు సీఎం జగన్ కాద‌ని, జూమ్ మీటింగ్‌లు మానుకొని బాబు రాష్ర్టానికి రావాల‌ని తెలిపారు. రాష్ర్టంలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్రాథ‌మికంగా విశాఖ‌లో 5795 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.  న‌ష్ట‌పోయిన ప్ర‌తీ రైతును ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల జాబితాను గ్రామ వార్డ్ స‌చివాల‌యంలో పెడ‌తార‌ని, ఎవరి పేర్ల‌యినా  జాబితాలో లేక‌పోయినా  నమోదుకు మళ్ళీ అవకాశం కల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.  

రాష్ర్టంలో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా  విశాఖ‌ప‌ట్నం జిల్లాలో  660 సెంటి మీటీర్ల వర్షపాతం నమోదయ్యిందని, ఇది సాధారణం కంటే  500 రేట్లు ఎక్కువ అని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ముందుగా అప్రమత్తం అవడం వ‌ల్ల మత్స్యకారులకు నష్టాన్ని చాలా వరకు నివరించగలిగామని తెలిపారు. భారీ వర్షాలకు  జీవిఎంసీలో  15 కోట్ల నష్టం , ఈపిడిసిఎల్‌కు 16 లక్షల నష్టం వాటిల్లిందని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. 30 మండలాల్లో వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. భారీ వర్షాలకు జిల్లాలో 5 మంది చనిపోయారు. 90 ఇల్లులు డ్యామేజి అయ్యాయి. రోడ్లు దెబ్బ‌తిని 62 కోట్ల న‌ష్టం వాటిల్లింది. పంట న‌ష్టం జ‌రిగిన రైతుల వివ‌రాల‌ను  గ్రామ వార్డ్ సచివాలయంలో పెట్టమని సీఎం ఆదేశించారు. ఎవరైనా పేర్లు నమోదు కాకపోతే వారికి మ‌రోమారు అవ‌కాశం ఇస్తామ‌ని పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top