ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ

ప్రశ్నించే గొంతుకలపై చంద్రబాబు ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌’

ఎం.మనోహర్‌రెడ్డి ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి

ఫేస్‌బుక్‌లో పార్టీ అఫీషియల్‌ పేజీ బ్లాక్‌ చేశారు

ఇది కూటమి ప్రభుత్వ దుర్మార్గమైన చర్య

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ‘ఎక్స్‌’ హెడ్‌ ఆఫీస్‌

అక్కడికి గుంటూరు పోలీసుల నోటీసులు!

ఇంత కంటే హేయమైన చర్య ఇంకేముంటుంది?

రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు తీవ్ర భంగం

ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో దారుణంగా విఫలమై, ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేకనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతోందని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన విపక్షంతో పాటు, సామాన్యుల వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడానికి సీఎం చంద్రబాబు పోలీసు వ్యవస్థను వాడుకుంటూ ఒక ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌’ (వ్యవస్థీకృత నేరం)కు తెర లేపారని ఆయన ఆక్షేపించారు. కేవలం అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే కుట్రతో వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని స్క్రీన్‌ పై కనిపించకుండా బ్లాక్‌ చేయించడం అత్యంత దుర్మార్గమని, చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్‌రెడ్డి ప్రస్తావించారు.
ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

5 దశల ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌’:
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సోషల్‌ మీడియా ద్వారా అడ్డుకునేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోంది. 5 దశల ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తూ.. సోషల్‌ మీడియాలో వైయ‌స్ఆర్‌సీపీ సెన్సార్‌షిప్‌కు కుట్ర చేస్తోంది.
తొలి దశ (నిఘా):
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు లేదా సామాన్యులు సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు, ధరల పెరుగుదల, ఇసుక దోపిడీ, అత్యాచారాలు, శాంతిభద్రతల విఫలంపై పోస్టులు పెడితే తక్షణమే గమనిస్తారు.
రెండో దశ (బెదిరింపులు):
సదరు పోస్టులు పెట్టిన వారిపై టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు, బెదిరింపులకు దిగుతారు.
మూడో దశ (అక్రమ కేసులు):
కంటెంట్‌లో అసభ్యత ఉందా లేదా అని కూడా చూడకుండా, కులాల మధ్య ఘర్షణలు పెంచుతున్నారంటూ దారిన పోయే గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారు. పోలీసులు కూడా ఎలాంటి విచారణ లేకుండా తక్షణమే కేసులు నమోదు చేస్తారు.
నాలుగో దశ (గ్లోబల్‌ కంపెనీలకు లేఖలు):
కేసు నమోదు చేసిన వెంటనే, సంబంధిత పోలీస్‌ అధికారుల చేత వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌), ఎక్స్‌ (ట్విట్టర్‌) ప్రధాన కార్యాలయాలకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలను జతచేసి నోటీసులు పంపిస్తారు. ఇవి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పోస్టులంటూ అకౌంట్లను బ్లాక్‌ చేయాలని ఒత్తిడి తెస్తారు.
ఐదో దశ (అకౌంట్ల తొలగింపు):
కేవలం పోలీసుల తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా చట్టవిరుద్ధంగా అకౌంట్లను స్క్రీన్‌ పై కనిపించకుండా తొలగిస్తున్నారు.

పార్టీ ఫేస్‌బుక్‌ పేజీ బ్లాక్‌ చట్టవిరుద్ధం:
    వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఎక్కడా అశ్లీలత, అసభ్యత ఉండవు. కేవలం రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను, ప్రజా సమస్యలను ప్రతిబింబించే వీడియోలే ఉంటాయి. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ను ఇలాగే తొలగిస్తే, తాము మెటా సంస్థకు ఫిర్యాదు చేసి పునరుద్ధరించుకున్నాం. తాజాగా పార్టీ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీని కూడా పోలీసుల ఒత్తిడితో తొలగించడం అత్యంత దారుణం. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 69–ఏ (లేదా సంబంధిత నియమాలు) ప్రకారం ఏదైనా కంటెంట్‌ తొలగించాలంటే దానికి ఒక నిర్దేశిత విధానం, కమిటీ పరిశీలన ఉండాలి. కేవలం కంటెంట్‌ విద్వేషపూరితంగా ఉంటే దాన్ని మాత్రమే తొలగించాలి తప్ప, ఏకంగా పార్టీ అధికారిక పేజీలనే బ్లాక్‌ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు. 

పోలీసుల అత్యుత్సాహం. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఉల్లంఘన:
    మదనపల్లి, కర్నూలు రూరల్, శ్రీకాళహస్తి, గుంటూరు వంటి ప్రాంతాల్లోని కొంతమంది సీఐలు, ఎస్సైలు కేవలం వైయ‌స్ఆర్‌సీపీ అకౌంట్లపై నిఘా పెట్టడం, వాటిని డిలీట్‌ చేయాలని సోషల్‌ మీడియా కంపెనీలకు లేఖలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో సుప్రీంకోర్టు ’నల్లబాలు’ కేసులో స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. ఒక రాజకీయ నాయకుడిని విమర్శిస్తే బాధితులే నేరుగా ఫిర్యాదు చేయాలి తప్ప, దారినపోయే ’ఎక్స్, వై, జెడ్‌’ వ్యక్తులు ఇచ్చే ఫిర్యాదులపై కేసులు పెట్టకూడదని చెప్పినా పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో కూడా నేరుగా రిమాండ్‌కు పంపుతూ కోర్టులతో చీవాట్లు తింటున్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా పోలీసుల తీరు మారడం లేదు. 

అక్రమాలను ప్రశ్నిస్తే అణిచివేతలా!:
    అమరావతి అవినీతిని ప్రశ్నిస్తే, గుంటూరు కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ నుండి శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ‘ఎక్స్‌’ ప్రధాన కార్యాలయానికి నోటీసులు పంపారు. డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడితే ఆ పోస్టులను భారతదేశ వ్యాప్తంగా డిలీట్‌ చేయించారు. ఇందాపూర్‌ – హెరిటేజ్‌ లింకులు, బీఆర్‌ నాయుడు వ్యవహారాలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు, కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపితే ఆ కంటెంట్‌ను తొలగించారు. ఉత్తర భారతదేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎవరో పెట్టిన పోస్టును వైయ‌స్ఆర్‌సీపీ అధికారిక మీడియా ‘జగనన్న కనెక్ట్స్‌’కు ఆపాదించి తప్పుడు ఫిర్యాదులు చేశారు.

ఇదీ రెండు ప్రభుత్వాల మధ్య తేడా:
    2019–24 మధ్య కాలంలో ఐటీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మాధ్యమాలు అప్పటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా జగన్‌గారిపై నిత్యం పచ్చి అబద్ధాలు, అసభ్యకర డిబేట్లు, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, నాటి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అకౌంట్లను బ్లాక్‌ చేయించే చిల్లర పనులకు ఒడిగట్టలేదు. కానీ ఇప్పుడు జగన్‌గారు ఆధారాలతో సహా ప్రెస్‌మీట్‌ పెడితే, దానికి బదులిచ్చే ధైర్యం లేక పది మంది మంత్రుల ‘పచ్చమంద’ వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ నియంతల జాబితాలోకి చేరిపోయేలా ప్రవర్తిస్తున్నారు. 

న్యాయపోరాటం తప్పదు:
    ప్రభుత్వ విధానాల్లోని లోపాలను విమర్శిస్తే తట్టుకోలేక, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. చట్టాన్ని బైపాస్‌ చేసి నియంతల్లా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం. వైయ‌స్ఆర్‌సీపీచకపోతే న్యాయస్థానాల ద్వారా చట్ట ప్రకారం పేజీని పునరుద్ధరించుకుంటాం. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వ్యవస్థలపై రెట్టింపు స్థాయిలో చట్టపరమైన చర్యలు ఉంటాయి. 
    ఇన్ని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కాలం దగ్గరపడింది. అణచివేత పెరిగేకొద్దీ తిరుగుబాటు కూడా అంతే బలంగా ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండకు రాబోయే రోజుల్లో రెట్టింపు స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top