నేడు తిరుపతిలో సీఎం వైయ‌స్ జగన్‌ పర్యటన

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్ వేడుక‌కు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రజల నుంచి వినతులను కూడా స్వీకరించనున్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సాయంత్రం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 5.15 గంటల వరకు విమానాశ్రయం వద్ద ప్రజలు నుంచి వినతులు స్వీక‌రిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. అక్క‌డ శ్రీసిటీ ఎండి రవి సన్నారెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంత‌రం తాడేప‌ల్లికి తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతారు.

Back to Top