కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం

తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయనున్నారు. మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపు కొనసాగనుంది. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాల మూసివేయనున్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లకు అనుమతిచ్చారు. అయితే సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌ ఉండాలని ఆదేశించారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ రెస్టారెంట్లు, జిమ్స్, కల్యాణమండపాలు తెరుచుకోవచ్చని, శానిటేజర్, మాస్క్, భౌతికదూరం తప్పనిసరి అని ఆదేశించారు. జూలై 8 నుంచి తాజా నిర్ణయాలు వర్తిస్తాయి.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top