ఉరవకొండలో ఘనంగా సీఎం వైయ‌స్‌ జగన్ పుట్టినరోజు వేడుకలు

 కేక్ క‌ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, యువనేత ప్రణయ్ రెడ్డి
 

ఉరవకొండ:   రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి 51 వ పుట్టినరోజు వేడుకలను ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, యువజన విభాగం జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ముందుగా వైస్సార్సీపీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైయ‌స్ఆర్ సర్కిల్ లో దివంగత మహానేత వైయ‌స్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, అభిమానుల మధ్య మాజీ ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు.నాయకులకు తినిపించారు.ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. ఆయన శాశ్వత సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి 51 పుట్టినరోజును పురస్కరించుకుని మైనార్టీ విభాగం నాయకులు పామిడి నూర్ ప్రత్యేకంగా 51 కేజీల కేక్ ను తయారు చేయించారు.ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Back to Top