రైల్వే భూముల‌ను పేద‌ల‌కు ఇవ్వండి 

  రైల్వే మంత్రికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్  లేఖ

అమరావతి: రాష్ట్రంలో వివిధ రైల్వే పనుల అభివృద్ధిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి‌ లేఖ రాశారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ఉన్న రైల్వే భూములను ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రిని  సీఎం వైయ‌స్‌ జగన్‌ కోరారు. ఇక్కడి రైల్వే భూముల్లో దాదాపు 800 కుటుంబాలు 30 ఏళ్లుగా నివాసముంటున్నాయని వైయ‌స్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

రాజరాజేశ్వరిపేట రైల్వే భూములకు బదులుగా అజిత్‌సింగ్‌నగర్‌ దగ్గర ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వేకు ఇచ్చేందుకు సిద్ధం చేశామని సీఎం వైయ‌స్  జగన్‌ లేఖలో తెలిపారు. ఇప్పటికే అజిత్‌సింగ్‌నగర్‌ దగ్గర  ఉన్న భూమిని రైల్వే, రెవెన్యూ బృందాలు పరిశీలించాయని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  లేఖ‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top