స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు.. నిర్ణయం మార్చుకోండి

ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు.. నిర్ణయం మారుకోవాలని కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరారు. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనపై సీఎం వైయస్‌ జగన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేంద్ర మంత్రి ప్రకటన ప్రజలను, కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశమని, ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20 వేల కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. ‘ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందుంచుతాం. ప్లాంట్‌ ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’ అని లేఖలో పేర్కొన్నారు.

 

Back to Top