రేపు నెల్లూరు జిల్లాలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రులు, అధికారులు
 

నెల్లూరు: సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్‌(800 మెగావాట్లు)ను సీఎం వైయ‌స్ జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు.  గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 మధ్యలో నేలటూరులోని ఏపీ జెన్‌కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేసి.. అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు నేలటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.   
 
ముత్తుకూరు మండలం నేలటూరు సమీపంలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జెసి కూర్మనాథ్, నూడా వీసీ బాపిరెడ్డి, జెన్కో ఇంజనీర్లు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప‌రిశీలించారు.

Back to Top