డిసెంబ‌ర్ 7న దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

విజ‌య‌వాడ‌: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 7వ తేదీన సీఎం వైయ‌స్ జగన్‌ చేతుల మీదుగా దుర్గ గుడి అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపనలు జ‌ర‌గ‌నున్న‌ట్లు డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లా­డుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్‌ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

తాజా వీడియోలు

Back to Top