నిరుపేద కుటుంబాలకు ధీమా.. ‘వైయస్‌ఆర్‌ బీమా’

కాసేపట్లో వైయస్‌ఆర్‌ బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు. నవరత్నాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆ దిశగానే నిరుపేద కుటుంబాలకు అండగా మరో పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ‘‘వైయస్‌ఆర్‌ బీమా’’ పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ కాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రతను ఇస్తూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుంది. ఈ మేరకు రూ.510 ప్రీమియం మొత్తాన్ని సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించనున్నారు. 

18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా, సహజ మరణానికి రూ. 2 లక్షల బీమా, 51 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు వారు మరణిస్తే రూ.3లక్షల బీమా వర్తించనుంది. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా రక్షణగా నిలవనుంది. వైయస్‌ఆర్‌ బీమా పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. 
 

Back to Top