దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ సేవా యాప్‌

కాసేపట్లో యాప్‌ను ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్‌

పీఎస్‌కు వెళ్లకుండానే అందుబాటులోకి 87 రకాల సేవలు

తాడేపల్లి: దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ కోసం రూపొందించిన సరికొత్త యాప్‌ను ముఖ్యమంత్రి వైయస్‌‌ జగన్‌ కాసేపట్లో ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ పోలీస్‌ శాఖ యాప్‌ను సీఎం ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ కొత్త యాప్‌ రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని నేరాలపై ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. అత్యవసర సమయాల్లో వీడియో కాల్‌ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా 12 రకాల సేవలు ఈ యాప్‌ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా అన్ని నేరాలపై ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం ఉంది. 

Back to Top