మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ను ప‌రామ‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: రాష్ట్ర‌ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అస్వస్థతతో బాధపడుతున్న మంత్రి ఆదిమూల‌పు సురేష్‌కి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వ‌హించి యాంజియోప్లాస్టి చేశారు. విష‌యం తెలుసుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్.. మంత్రి ఆదిమూల‌పు సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top