వ‌ర‌ద బాధితుల ప‌రామ‌ర్శ‌కు బ‌య‌లుదేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నేడు, రేపు వైయ‌స్ఆర్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పరిశీలన

బాధితులు, రైతులతో ముఖాముఖి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష

 తాడేప‌ల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు,  వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ముఖ్య‌మంత్రి  వైయ‌స్‌.జగన్‌మోహన్‌ రెడ్డి తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌య‌లుదేరారు. గురు, శుక్రవారాల్లో  వైయ‌స్ఆర్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌టించి అక్క‌డి ప‌రిస్థితుల‌ను పరిశీలించనున్నారు. 

► తొలిరోజు వైయ‌స్ఆర్, చిత్తూరు జిల్లాల్లోని బాధితులు, రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తారు. సంబంధిత సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు. అనంతరం రాత్రికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు.
► రెండో రోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించి..అధికారులతో సమీక్షిస్తారు.
► సంబంధిత సహాయశిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతారు.  ఆయా ప్రాంతాల్లో జరిగిన వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. 
► అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ ఇలా..  
►2వ తేదీ ఉదయం 9.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►అక్కడి నుంచి 10.50 గంటలకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►11.10 గంటలకు పులపుత్తూరు గ్రామానికి చేరుకుని అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం పులపుత్తూరు సచివాలయానికి చేరుకుంటారు. 
►మధ్యాహ్నం 12.30 గంటలకు ఎగువ మందపల్లె గ్రామానికి చేరుకుని గ్రామాన్ని పరిశీలిస్తారు. 
►అనంతరం 1.30 గంటల ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తారు. 
►1.45 గంటలకు తిరిగి నవోదయ విద్యాలయానికి చేరుకుంటారు. 
►2.15 నుంచి 2.45 గంటల వరకు నవోదయ విద్యాలయంలో జరిగే జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.  
►ఆ తర్వాత 3.05 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంటకు బయలుదేరి వెళతారు.    

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top