నేడు ప్రకాశం జిల్లాకు  సీఎం వైయ‌స్ జగన్‌

మంత్రి ఆదిమూలపు సురేష్‌ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరు 

ప్ర‌కాశం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారైందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ క్యాంపు కార్యాలయం  ప్రకటన విడుదల చేసింది. మంత్రి సురేష్‌ కుమార్తె శ్రిష్టి వివాహ రిసెప్షన్‌ సోమవారం యర్రగొండపాలెంలో జరగనుంది.

ఈ కార్యక్రమానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ హాజరై నూతన దంపతులు శ్రిష్టి, సిద్ధార్థ్‌లను ఆశీర్వదిస్తారు. సోమవారం ఉదయం 10.40 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. 11.25 గంటలకు యర్రగొండపాలెం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 వరకు హెలీప్యాడ్‌ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో మాట్లాడతారు. 11.40 నుంచి 11.55 గంటల వరకు రిసెప్షన్‌లో పాల్గొంటారు. తిరిగి 12 గంటలకు హెలీప్యాడ్‌ వద్దకు చేరుకొని హెలికాప్టర్‌లో తాడేపల్లికి చేరుకుంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top