3న కాకినాడలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పర్యటన

కాకినాడ: సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈనెల 3న(బుధవారం) కాకినాడలో పర్యటించనున్నారు. వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. 

Back to Top