పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచింది

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వీడియో ట్వీట్‌

తాడేప‌ల్లి: ల‌క్ష‌లాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవ‌కాశం క‌లిగినందుకు చాలా సంతోసంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన పెద్ది శ్రీను కుటుంబానికి జ‌రిగిన మంచిని వివ‌రిస్తూ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వీడియో ట్వీట్‌ చేశారు. 

``పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. శ్రీనుకు దివ్యాంగ పెన్షన్ తో పాటు తన భార్య పేరుమీద భూపట్టా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి ఇచ్చి వారి జీవితంలో, ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది`` అని వివ‌రిస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

https://twitter.com/ysjagan/status/1646893682824724481?s=20

Back to Top