స్పందనలో ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారం

ప్రజా సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి

సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఆదేశం

సమీక్ష వివరాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని 

అమరావతిః స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కారానికి త్వరితగతిన చర్యలు  తీసుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు..స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సీఎం సమీక్ష సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదులు వచ్చిన ఏడు రోజులు లోపు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టి సమస్యలకు పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.మానవత్వంతో స్పందించి ప్రజల సమస్యలు పరిష్కారించాలని సూచించారన్నారు.ప్రభుత్వ తప్పులపై ఫిర్యాదులు వస్తే విచారణ చేపట్టాలన్నారు.స్పందన కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు.కింద స్థాయి వ్యవస్థ నుంచి అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు,ఎస్పీలదేనని తెలిపారన్నారు.

 

Back to Top