ఆప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ

తెలుగు ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హోలీ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి: అప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలుగు ప్ర‌జ‌ల‌కు హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ఆప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ! ప్ర‌తి ఒక్క‌రి జీవితం ఆనందాల‌తో నిండాల‌న్న ఆకాంక్ష హోలీ! ఈ హోలీ పండుగ వేళ రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటా సంతోషాల స‌ప్త వ‌ర్ణాలు వెల్లివిరియాల‌ని నిండు మ‌న‌సుతో కోరుకుంటున్నాను! అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top