ఎమ్మెల్సీ చ‌ల్లా భ‌గీర‌థ‌రెడ్డి పార్థీవ‌దేహానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు

కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ముఖ్య‌మంత్రి
 

నంద్యాల‌:  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు.  నంద్యాల జిల్లా అవుకు గ్రామంలోని ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి స్వ‌గృహానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న పార్థీవ దేహంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాలుల‌ర్పించారు. అనంత‌రం  కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు.   నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46) గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top