‘సిరివెన్నెల’ కుటుంబానికి అండగా సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వైద్యం ఖర్చు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి చెల్లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అదే విధంగా సిరివెన్నెల‌ కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top